Pages

Monday 10 August 2015

సృష్టి కి మూలం అమ్మ ( srustiki mulam amma)

                     మన చుట్టూ ఎంత మంది ఉన్న కొన్ని సార్లు మనిషి వంటరిగా భావిస్తాడు ఎందుకు అనేది తెలయదు దానికి కారణం మనలోని అబద్రత భావమో లేక అసంతృప్తో తెలయదు ?

                   మనలో నిత్యం అనునిత్యం ఎన్నో ఆలోచనలు వస్తు ఉంటై , కొన్ని సార్లు ఆలోచించిన రాని ఆలోచనలు
అల నాలో మొదలైన మొదటి ఆలోచన "అమ్మ"          

              ముందుగా  నేను చెప్పాలి అనుకున్నది అమ్మ గురించి ఎందుకు అంటే ఈ లోకం లో  ముందు మనకు పరిచయం అయ్యే  వ్యక్తి అమ్మ 

         కంటికి కనిపించని ఆ దైవం కన్నా   మన కంటికి కనిపించే అమ్మే మిన్న

          ఆ భగవంతుడు మనలని ఈ సృష్టి లో కి పంపించటానికి సాహాయ పడితే అమ్మ మాత్రం మనం ఈ సృష్టి లో కి వచ్చిన నాటి నుండి తన చివరి వరకు మన గురించి ఆలోచించే అనురాగ దేవత అమ్మ

           అలంటి అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే అలంటి అమ్మ కోసం ఒక చిన్న కవిత    

                        తేనెలు వొలికే తియ్యని మాట అమ్మ పెదవలు పలికే మొదటి మాట అమ్మ 
                        మనలో అనురాగాన్ని నింపి , మన పై మమతను కురిపించే అమృత వర్షిని అమ్మ 
                        ప్రేమను పంచి సమతను పెంచిన అనురాగ దేవత అమ్మ
                       ఇహ లోకం నుండి ఈ లోకం కు మనలను తెసుకొచ్చిన మాతృ మూర్తి అమ్మ
                       పుట్టుక అనే   రాగమను మనకు పరిచయం చేసిన తియ్యని పాటల పాల్లవి  అమ్మ
                       మనకు మంచిని చెడును నెరిపిన మహా మన్వితరాలు అమ్మ
                       ఈ లోకం లో అన్నిటి కి అన్న మిన్న అమ్మ 


ఈ కొంచం సరిపోదు అలంటి అమ్మ గురించి చెప్పటానికి కానీ చెప్పలేకుండా ఉండలేకపోయాను
మన ఈ జన్మకు అమ్మ ఎంత అవసరమో నాన్న అంతే అవసరం
నాన్న :
               మనకు జన్మ ను ఇచ్చేది అమ్మ ఐతే ఆ జన్మ కు రూపం ఇచ్చేది నాన్న
               తాను ఇచ్చిన రూపాన్ని వెనక నుండి నడిపించే కనిపించని ఒక శక్తీ నాన్న
               అహర్నిశలు శ్రమిస్తూ తనవాళ్ళ  అందరికి  వెలుగును ఇచ్చే దీపం నాన్న
                           
       అలంటి అమ్మ నాన్నలును ఎప్పుడు దూరం చేసుకోవద్దు  మీరు  ఎప్పుడు వాళ్ళకు దూరం కావద్దు 

1 comment: