Pages

Monday 10 August 2015

సృష్టి కి మూలం అమ్మ ( srustiki mulam amma)

                     మన చుట్టూ ఎంత మంది ఉన్న కొన్ని సార్లు మనిషి వంటరిగా భావిస్తాడు ఎందుకు అనేది తెలయదు దానికి కారణం మనలోని అబద్రత భావమో లేక అసంతృప్తో తెలయదు ?

                   మనలో నిత్యం అనునిత్యం ఎన్నో ఆలోచనలు వస్తు ఉంటై , కొన్ని సార్లు ఆలోచించిన రాని ఆలోచనలు
అల నాలో మొదలైన మొదటి ఆలోచన "అమ్మ"          

              ముందుగా  నేను చెప్పాలి అనుకున్నది అమ్మ గురించి ఎందుకు అంటే ఈ లోకం లో  ముందు మనకు పరిచయం అయ్యే  వ్యక్తి అమ్మ 

         కంటికి కనిపించని ఆ దైవం కన్నా   మన కంటికి కనిపించే అమ్మే మిన్న

          ఆ భగవంతుడు మనలని ఈ సృష్టి లో కి పంపించటానికి సాహాయ పడితే అమ్మ మాత్రం మనం ఈ సృష్టి లో కి వచ్చిన నాటి నుండి తన చివరి వరకు మన గురించి ఆలోచించే అనురాగ దేవత అమ్మ

           అలంటి అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే అలంటి అమ్మ కోసం ఒక చిన్న కవిత    

                        తేనెలు వొలికే తియ్యని మాట అమ్మ పెదవలు పలికే మొదటి మాట అమ్మ 
                        మనలో అనురాగాన్ని నింపి , మన పై మమతను కురిపించే అమృత వర్షిని అమ్మ 
                        ప్రేమను పంచి సమతను పెంచిన అనురాగ దేవత అమ్మ
                       ఇహ లోకం నుండి ఈ లోకం కు మనలను తెసుకొచ్చిన మాతృ మూర్తి అమ్మ
                       పుట్టుక అనే   రాగమను మనకు పరిచయం చేసిన తియ్యని పాటల పాల్లవి  అమ్మ
                       మనకు మంచిని చెడును నెరిపిన మహా మన్వితరాలు అమ్మ
                       ఈ లోకం లో అన్నిటి కి అన్న మిన్న అమ్మ 


ఈ కొంచం సరిపోదు అలంటి అమ్మ గురించి చెప్పటానికి కానీ చెప్పలేకుండా ఉండలేకపోయాను
మన ఈ జన్మకు అమ్మ ఎంత అవసరమో నాన్న అంతే అవసరం
నాన్న :
               మనకు జన్మ ను ఇచ్చేది అమ్మ ఐతే ఆ జన్మ కు రూపం ఇచ్చేది నాన్న
               తాను ఇచ్చిన రూపాన్ని వెనక నుండి నడిపించే కనిపించని ఒక శక్తీ నాన్న
               అహర్నిశలు శ్రమిస్తూ తనవాళ్ళ  అందరికి  వెలుగును ఇచ్చే దీపం నాన్న
                           
       అలంటి అమ్మ నాన్నలును ఎప్పుడు దూరం చేసుకోవద్దు  మీరు  ఎప్పుడు వాళ్ళకు దూరం కావద్దు 

Sunday 9 August 2015

పుట్టుక :


పుట్టుక  అనెది ప్రతి జీవికి ఒక వరం ఏ జన్మ పుణ్యమో ఈ జన్మ మనకు లబించింది , అందున ఆడ జన్మ అంటే అదో వరం , కానీ ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టినదుకు సంతోషించాలో లేక బాధపడాలో తెలయని  అయోమయం

               ఒక అప్పుడు ఆడ పిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి అని ఆనంద పడే వాళ్ళు ! అదే ఈ రోజుల్లో ఆడపిల్లా? అనిపిస్తుంది
           
              కానీ ఆడ పిల్ల పుడుతుంది అంటే చాల వరకు అందరు బయపడే పరిస్థితి ఏర్పడింది
             అలంటి   ఆడ పిల్ల  ఆవేదన ఎలా ఉంటుంది ?????

                       అమ్మ నేను ఆడ పిల్లను కానీ ఆడుకొని బొమ్మను కాదు అమ్మ
                      నాకు కావలిసింది నీ గుండెలో గుప్పుడెంత చోటు మాత్రమే , చెత్త కుప్పల్లో కావలిసింత కాదు 
                      మణి మకుటాలు ఏమి వద్దు నాకు నీ ప్రేమ ఉంటే చాలు అమ్మ
                      ఎందుకు అమ్మ నేకు ఇంత వివక్షత నా మీద? కురిపించవా నా పై నీ ప్రేమ అని అమృతపు ధార
                     చల్లని నీ చూపు చాలు అమ్మ నాకు మమతలు ను విసిరే నీ చిరు నవ్వు చాలు అమ్మ నాకు
                    ఆప్యాయతలు ను పంచే నీ కమ్మని కౌగిలి చాలు , అంతస్తులును మురిపించే నీ అనురాగం చాలు అమ్మ !
                   ఆడ పిల్ల  ను నిజంగా ఆడ పిల్ల లనే చూస్తారు ఎన్ని తరాలు మరీనా ఈ వివక్షత అలానే  కొనసాగుతుంది  .

 అది నుండి ఆడ వాళ్ళ మీద అకృత్యాలు జరుగుతునే ఉన్నాయ్  నేను వంచించిన అడ వాళ్ళ గురించి మాట్లడటం లేదు ఎందుకు అంటే ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి , కొన్ని సార్లు మన ప్రమేయం లేకుండా మోసపోతున్న వాళ్ళ గురించి మాట్ల్దుతున్నాను

పుట్టిన నాటి నుండి సీత ల ఉండాలి , అనసూయ ల ఉండాలి అని చెప్తారు కానీ రావణుడు లాంటి వాళ్ళు ఉంటారు , కిచకులు ఉంటారు అని మాత్రం చెప్పటం లేదు మనకు

            కానీ  ఇప్పుడు ప్రతి చోట ఏదో ఒక రూపం లో కిచుకలు, దుస్యసనులు  తరాసపడుతున్నారు , ప్రతి రోజు మనం ఒక ద్రౌపది గురించి వింటున్నాము

                   యాత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర  దేవత ----ఎక్కడ స్త్రీ ని పూజిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని అంటారు కానీ ఈ రోజుల్లో ఎక్కడ స్త్రీ  వంటరి గ కనిపిస్తుందో అక్కడ మానవ మృగాలు సంచరిస్తునై
                   
మనకు అమ్మ కావాలి ఎందుకు అంటే మనం పుట్టాలి కాబట్టి సృష్టి అగకుడదు కాబట్టి , భార్య కావాలి ఎందుకు అంటే పెళ్లి చేసుకోవటానికి మనకు తోడూ గ , కానీ ఆడ పిల్ల మాత్రం వద్దు ఎందుకు అంటే భయం ఎక్కడ కాపాడాలి ,
ఎక్కడ ఒకరి కింద ఉండాలి అని
కానీ ఆడ పిల్ల అంటూ లేకపోతే ఇన్ని పాత్రలు ఎక్కడివి ?
                  మనకు  కార్యేషు దాసి
                              కర్మేషు మంత్రి
                              బోజేషు మాతా
                            సాయనేషు రంబ
అని అడ దాన్ని అన్నారు కానీ ఎప్పుడు ఎక్కడ మగ వారిని అనలేదు అది కూడా వాళ్ళ స్వలాభం కోసమే చెప్పి ఉండ వచ్చు బహుశా
                          ఇంకా ఐన ఈ వివక్షత పోవాలి అని మనసపుర్తి గ కోరుకుంటున్న 

Saturday 8 August 2015

బాల్యం

బాల్యం  ప్రతి మనిషి జీవితం లో ఎంతో ముఖ్యం  ఐనిది
                 మన బాల్యంలో మంచి సంఘటనులు ఉంటాయి అలానే చెడు  సంఘటనులు ఎదురై ఉంటాయి
అలానే మనకు చాల మంది స్నెహుతులు తారస పడతు ఉంటారు మనం ఎన్నోనేర్చుకొని ఉంటాము
               ఎన్నో చిలిపి సంఘటనులు ,  తీపి ఉహలు కలసినది మన బాల్యం
బాల్యం లో మనకు ఎన్నో జ్ఞాపకాలు , నిన్న ఒక జ్ఞాపకం , నేడు ఒక జ్ఞాపకం రేపు ఒక జ్ఞాపకం
   
             స్నేహుతుల తో కలిసి తరగతులు ఎగోట్టి  యేటి గట్టున    ఆడిన ఆ రోజుళ్ళు మరపు రానివి ..

                ఎవరు చూడకుండా చింతకాయలూ, మామిడికాయలు దొంగతనంగ కోసుకోనివచ్చిన , కోస్తూ ఉండగా ఆ ఇంటి ఆవిడా రాగానే చెట్టు పైన దాక్కున్న సందర్బాలు మళ్ళి రామన్న రావేమో

                      సెలవా రోజుల్లో స్నేహితులుతో ఆడిన కోతికోమ్మచ్చ్హి  ఆటలు , రాత్రిపూట ప్రైవేటు నుండి వెళ్తుంటే  ఫ్రెండ్స్ దెయ్యం కథలు గురించి చెప్పి బయపెట్టటం హ హ హ హ   ......

                      రాత్రుళ్ళు ఫ్రెండ్స్ చేసిన  మిశ్రిమ అధ్యయనం (కంబైన్డ్ స్టడీ)  అప్పుడు ఒకరిని చూడకుండా ఒకరు చుదవుతుఉండగా మనం మాత్రం నిద్ర పోవటం , తర్వాత పరిక్షలో ఏమి రాయాలో తెలయక ఎవరినా చూపిస్తారేమో అని ఎదురు చూడటం అప్పుడు అది ఏంటో తెలయకపోయన ఇప్పుడు మాత్రం తలుచుకుంటే చాల బాగుంటుంది .......
                   స్నేహితుల మద్య చిలిపి తగాదాలు , మరలా  అవి ఎప్పుడు తిరతాయ తిరిగి వాళ్ళతో ఎప్పుడు మాట్లాడతామ? అని ఎదురు చుప్పులలో ని ఆ కమ్మదనం బాగుంటుంది
          ఆ  వయుసులో అమ్మ చేతి ఆవకాయ ముద్ద లోని కమ్మదనం , వనచినుకులో మట్టి వాసనలోని కమ్మదనం ఎన్ని సార్లు అనుబవించిన మళ్లీ  మళ్లీ  తనివి   తీరదు

                  చిన్నతనం లో తాతిముంజలు కోసం చుసిన ఎదురు ఛుపులు ! బియ్యములో దాచిపెట్టుకొని తిన్న ఈతకాయలు
                  బడికి వెళ్ళి దారిలో తాత దగ్గర కోనుకోన్ని తిన్న మరమారాల ఉండలు నాతో పాటు నా స్నెహుతులు కి కూడా ఇప్పించటం లో ని ఆ సరదా ఎంతో బాగుంటుంది
             
                    అప్పుడు అప్పుడు తాటి చెట్లకు ఉన్న కల్లు ను చూసినప్పుడు దాని రుచి ఎలా ఉంటుందో చూడాలి అన్న ఆలోచన మల్లి అంతలో బాగుండదేమో అన్న మొహమాటం
                 
                      శ్రీరామ నవమికి గుడి దగ్గర పానకం ఇస్తుంటే దానికోసం అది వరసలో 4 సార్లు నుంచునిఉండటం ఎంతో తియ్యని అనువభవం
                   
                           అందరికి సైకిల్ వచ్చింది మనకు మతర్మాయ్ రాలేదు అని స్వయం కృషి తో ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నం లో వెళ్లి మురుగు గుంటలో పడటం కపడండి అని అరిచినప్పుడు ఎలాగో బితకి రావటం తరవాత ఆ వాసనా పోవటానికి ఎన్నో సార్లు స్నానం చేయటం ఇప్పటికి మరపు రానిది
                                 రోజుకు ఒక గొడవ ఇంటిమేడైకి తెసుకొని వచినప్పుడు అమ్మ నాన్న లు చేసిన చేపిరి పూజలు ఎన్నో సార్లు...
                                   బస్సు డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్ళినప్పుడు అది కోపమో ఆపకుండా వెళ్ళాడు అనిన అసహనమో అది బస్సు మీద రాయ్యతో కొట్టటం ఆ డ్రైవర్ మమ్ములుని తరమటం అది చూసి మేము అందరం చాల దూరం పరిగేట్టం అది మరపురాని ది..................

                          తిరునాళ్ళలో ఆ బ్రేక్ డాన్సు లు చూస్తూ ఆనందించన ఆ క్షణాలు మళ్లీ తిరిగిరవేమో
             
                వేసవి సెలవలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడటం వచ్చాక ఉరు ఎప్పుడు వెళ్దామా అనుకోవటము అంత గడిచిపోయన రోజులు మళ్లీ రామన్న రావు కదా
                     అంత హ్యాపీ డేస్ వేణు దిరిగి చూసుకుంటే కానీ కొన్ని అపశ్రుతులు అవి ఎందుకు వస్తాయో అప్పుడు తెలయలేదు కానీ మంకు వయసు పెరిగిన కొద్ది అనుబవాలు మీద తెలుస్తాయి

                   అప్పుడు మన ప్రాణస్నెహుతులు మనకు దూరం ఇతి ఆ బాధ ఎలా ఉంటుందో మాత్రం మన మనసకు బాగా తెలుసు ఆ బాధ జీవితాంతం ఉంటుంది ఏమో
                ఇంకా చాల విషయాలు ఉన్నాయ్ బాల్యం లో జరిగినివి కానీ కొన్ని మాత్రమే ఇక్కడ చెప్పాను
బాల్యం గురించి కొన్ని చిరు మాటలు

                        జీవితం అనే పుస్తకం లో బాల్యం అనేది ఒక అందమైన అధ్యాయం 
                       ఆ అందమైన అధ్యాయంలో ఎన్నో తియ్యని ఐన పేజిలు 
                       ఒక్కో పేజి కి ఎన్నో మరపు రాని జ్ఞాపకాలు , ఒక్కో జ్ఞాపకం మన మదిలో చెరిగిపోని ,తిరిగిరాని తీపి గుర్తులు
                         ఆ తీపి గురతులు ఉంటాయి మనతో మన కడ వరకు
                        ఎన్నో అనుభవాలను మనకు పరిచయం  చేసే అనుభావజ్ఞాని ఈ మన బాల్యం 


 , అవి గుర్తు వచినప్పుడు మన మనసు అనుభవించే ఆనందం అంత ఇంత కాదు 

Friday 7 August 2015

యవ్వనం :

యవ్వనం :
                        ప్రతి మనిషి జీవితం లో ఈ యవ్వనం అనే పర్వం తప్పక ఉంటుంది , ఎన్నో తీపి బాధలను , మరి ఎన్నో మధురమైన అనుబూతులు ను మానుకు పరిచయం చేస్తుంది 
 యవ్వనం ఎంతో తెలివి ఐనది మరి ఎంతో చెడ్డని ఐనది  తణుకు అంటే తెలవి ిన వాళ్ళని ఏమి చేయలేక రాజీ పడుతుంది , తనకు అంటే తెలవి తక్కువ వాళ్ళని ఎంచుకొని వాళ్లతో ఆడుకుంటుంది
                    
                          ప్రతి మనిషికి ఈ పర్వం లో ఎవరో ఒకరు తారస పడుతూ ఉంటారు అది కొంత ముందు గాన లేక కొంత సమయం తర్వాత కానీ ఎదురు పడుతూ ఉంటారు 
      కానీ కొన్ని సార్లు అది ఆకర్షణ లేక నిజమైన ప్రేమ లేక నిజమని అనుకుంటున్నా ప్రేమ కూడా తెలయదు ?
     ఒక్కసారి మన మనసకు నచ్చిన వాళ్ళు కనిపించినప్పుడు  మనసు చేసి అల్లరి అం  ఇంత కాదు 
     అదే మనసకు నచ్చిన వాళ్ళు దూరం ఐతే మనసు పడే బాధ వర్ణనాతీతం 
కానీ   మధురమైన లేక ఆమధురమైన  జ్ఞాపకం మాత్రం మనతోనే  ఉంటుంది  
     ఐతే ఒక అబ్బాయి కి  లేదా ఒక అమ్మాయి  తనకు నచ్చిన అమ్మాయి  లేక అబ్బాయి కనబడితే కనపడితే    వాళ్ళ కోసం ఎమైన ఎంతైనా చేయాలి అనిపిస్తుంది కానీ ఒకరి తప్పులు ను ఒకరు ఎప్పుడు వోప్పుకోలేరో అప్పుడే వాళ్ళకు అర్ధం అవతుంది ..... ఏది నిజం ఏది అబద్దం అని 
                        అదే పరిస్తితి లో ఉన్న ఒక అబ్బాయి కి ఓ అందమైన అమ్మాయి కనిపించిన అప్పుడు  అదే ఒక అమ్మాయి కి తనకు నచ్చిన అబ్బాయి కనిపించిన అప్పుడు అతనిలో లేక ఆమేలో  రేగుతున్న అలజడుల సారం  ఒక నిండు జీవితం 
                   ఎవరు చెప్పిన ఎన్ని సార్లు చెప్పిన అదే కానీ నేను నాకు తెలిసింది మాత్రం ఇక్కడ చెప్పాను 
                 అందమైన వనం ఈ యవ్వనం 
                నువ్వు వెళ్ళే దారిలోనే ఉంది నీ జీవితం 
               నవ్వు ఎంచుకున్న మార్గం సరిఐనది ఐతే అవతుంది   జేవితం ఓ అందాల  పూలవనం 
               లేకుంటే అవతుంది అదే జీవితం ముళ్ళ వనం 

అందుకే జాగ్రత్త గ అలోచించి అడుగు వెయ్యాలి ఈ ఒక్క పర్వం లోనే కాదు జీవితం లో ప్రతి పర్వం లో ను జాగ్రత ఏంటో అవసరం 

                            
                     


ప్రేమ

ప్రేమ 
ప్రతి మనిషి జీవితం లో ప్రేమ అనేది ఏంతో  గొప్పదైన విషయం
                     ప్రేమ మనకు ఈ సృష్టిలో దొరికిన అందమైన, అద్బుతమైన ఓ వరం
మనం పుట్టిన నాటి నుండి మనం బ్రతికి ఉన్నతవరకు మనతో ఉండేది ఈ ప్రేమ
నిత్యం అనునిత్యం మనలో ఏకమై మమేకమైన ఏంతోఉన్నతమైనధీ  ఈ ప్రేమ
మన పుట్టుకలో ఉన్నది ఒక ప్రేమ అది అమ్మ ప్రేమ , నాన్న ప్రేమ
మన తోడపుట్టిన వాళ్ళ మీద ప్రేమ
చుట్టూ ఉన్న వాళ్ళ మీద మనకు తెలయకుండా ఏర్పడుతున్న ప్రేమ
ఈ జగం అంత  ప్రేమ మయం  .......నిజమైన ప్రేమ అనే పొర ఉన్న చోట ఎలాంటి మొబ్బులు, మైకాలు ఉండవు
                        ప్రేమను ప్రేమగా  ప్రేమించగలిగితే ఈ లోకం లో అంత అందం గ ఉంటుంది ఆనందం గ ఉంటుంది
                  ఆ ప్రేమను ప్రేమగా చూడలేని అప్పుడు అంత చీకటి మయం అవతుంది , 
ప్రతి మనిషి లో ఉండవలిసినది ప్రేమేగాని ..... స్వార్ధం , ద్వేషం , అసూయా కాదు
ఒక్కసారి మనం ఆ ముసుగులు అన్ని తెసి చూద్దాము అప్పుడు అనిపిస్తుంది మనం ఎంత ఆనందం ని కోల్పోతున్నాం అని ఏది కేవలం రాయటం మాత్రమే కాదు నిజం కూడా అదే ......
                            ప్రేమించటం కన్నా ప్రేమించబడటం గొప్ప అంటారు కానీ మనం ప్రేమించ లేని అప్పుడు ఎలా ఎక్కడ ప్రేమించ బడగలం ?
                     కానీ కొన్ని సార్లు ఆ ప్రేమ లో నిరిక్షనలు తప్పవు , పరిక్షలు తప్పవు  ఐన   ఆ నిరీక్షన లో ఎంతో మాధుర్యం దాగి ఉంటుంది
                        ప్రేమ అన్నది ఈ సృష్టిలో విరిసిన దివ్యవరం
               ప్రేమ జనించిన ప్రతి  చోటు ఎగురుతుంది శాంతి కబుతం
              దే ప్రేమ వికటించిన చోట జరుగుతన్నది యుద్ధం 
ఇలా ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే 
అందుకే ఒక్క మాట ప్రతి వ్యక్తీ ని , ప్రతి జీవి ని ప్రేమించటం నేర్చుకోండి , 

Thursday 6 August 2015

వివాహం

వివాహం :

          వివాహం అనేది ఎంతో  పవిత్రమైన,  పరమ పవిత్రమైన కార్యం  అందులో మన భారత దేశం లో దీనికి  ఎంతోప్రాముఖ్యత ఉంది , వివాహని కి ముందు  భార్య  , భర్త  ల లో  ఇద్దరి అభిప్రాయాలూ ఒక్కటి గ  ఉండవు 
            కానీ అలాంటి సమయం లో ఒకరి అబిప్రాయాలు ని ఒకరు గౌరవించుకుంటూ , ఒకరి తప్పులు ను ఒకరు క్షమించుకుంట ముందుకు వెళ్తూ ఉండాలి కానీ అక్కడి ఆగిపోకుడదు 
        ఆలా  ముందుకు వెళ్ళటం వాళ్ళ మనలని మనం సరిచేసుకోవటానికి వీలు ఉంటుంది అలానే మన వెంట నడిచే వాళ్ళని ముందుకు నడిపించ వచ్చును లేని పక్షం లో  మనమే కాదు మనతో నడిచే వాళ్ళని కూడా సమర్ద వంతం గ ముందుకు నడిపిస్తూ  వెళ్ళలేము ....
           మనలో ఉన్నవి కొన్ని సమయాల్లో ఉండకుడనివి అహం , దీని వలన లాభం కంటే నష్టం ఎక్కువ కొన్ని సార్లు అందరు తప్పులు చేస్తూ ఉంటారు ఆ సమయం లో  తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఐన  వాళ్ళలో  ని అహం ని తగ్గించుకొని  క్షమించమని అడగటం ఏంటో ఉత్తమ మైన  పని ,  అప్పుడు ఎదుటి వాళ్ళు వాళ్ళ యుక్క క్షమా గుణం తో వాళ్ళని క్షమించగలగాలి కానీ అది అన్ని సందర్బాలలో బావ్యం కాకపోవచ్చ్హు 
              
            ఒక అప్పుడు మన పూర్వికులు మద్య ఈ వివాహ బందం ఎంతో   దృడంగ  ఉండేది కారణం వాళ్ళ మద్య ఉన్న అవగాహన వాళ్ళ కావచ్చు లేక ప్రతి చిన్న దానికి అపర్దాలు లేకపోవటమే ...

  కానీ ఈ రోజుల్లో ఇలా ఉండే వాళ్ళు ఎంత మంది ఉన్నారు మనలో లేక మన చుట్టూ? 
పెళ్ళి అంటే కేవలం మూడు ముళ్ళు , 7 అడుగులు , బెల్లం జీలకర్ర , ఇవి  మాత్రమే కావు .............అర్ధం చేసుకొనే గుణం, క్షమా గుణం , ...............ఇవి కూడా ఏంటో అవసరం 


ఎంతో పవిత్రమైన పవిత్ర బంధం ఈ వివాహ బంధం 
ఎక్కడ పుట్టి ఎక్కడో పెరిగిన అడ మగ లను ఆలు మగ లు గ మార్చే బంధం ఈ వివాహ బంధం 
అపురూపం గ చూసుకుంటే అవతుంది ఈ బంధం మరపు రాని బంధం 




           

Friday 22 August 2014

జీవితం

జీవితం
            జీవితం కొన్ని సార్లు చాల చిన్నదిగ అనిపిస్తుంది కొన్ని సార్లు చాల పెద్దదిగ అనిపిస్తుంది , జీవితం అనేది ఒక పుస్తకం , ఈ పుస్తకం లో మనకు ఎన్నో పాత్రలు ఎదురు అవుతూ   ఉంటాయి ,ఎన్నో అనుభవాలు ఎదురు అవుతూ ఉంటాయి 
         ఆశ  నిరాశ ల వలయం ఈ జీవితం ,  
         సుఖ దుఃఖ ల సంగమం ఈ జీవితం