Pages

Saturday 8 August 2015

బాల్యం

బాల్యం  ప్రతి మనిషి జీవితం లో ఎంతో ముఖ్యం  ఐనిది
                 మన బాల్యంలో మంచి సంఘటనులు ఉంటాయి అలానే చెడు  సంఘటనులు ఎదురై ఉంటాయి
అలానే మనకు చాల మంది స్నెహుతులు తారస పడతు ఉంటారు మనం ఎన్నోనేర్చుకొని ఉంటాము
               ఎన్నో చిలిపి సంఘటనులు ,  తీపి ఉహలు కలసినది మన బాల్యం
బాల్యం లో మనకు ఎన్నో జ్ఞాపకాలు , నిన్న ఒక జ్ఞాపకం , నేడు ఒక జ్ఞాపకం రేపు ఒక జ్ఞాపకం
   
             స్నేహుతుల తో కలిసి తరగతులు ఎగోట్టి  యేటి గట్టున    ఆడిన ఆ రోజుళ్ళు మరపు రానివి ..

                ఎవరు చూడకుండా చింతకాయలూ, మామిడికాయలు దొంగతనంగ కోసుకోనివచ్చిన , కోస్తూ ఉండగా ఆ ఇంటి ఆవిడా రాగానే చెట్టు పైన దాక్కున్న సందర్బాలు మళ్ళి రామన్న రావేమో

                      సెలవా రోజుల్లో స్నేహితులుతో ఆడిన కోతికోమ్మచ్చ్హి  ఆటలు , రాత్రిపూట ప్రైవేటు నుండి వెళ్తుంటే  ఫ్రెండ్స్ దెయ్యం కథలు గురించి చెప్పి బయపెట్టటం హ హ హ హ   ......

                      రాత్రుళ్ళు ఫ్రెండ్స్ చేసిన  మిశ్రిమ అధ్యయనం (కంబైన్డ్ స్టడీ)  అప్పుడు ఒకరిని చూడకుండా ఒకరు చుదవుతుఉండగా మనం మాత్రం నిద్ర పోవటం , తర్వాత పరిక్షలో ఏమి రాయాలో తెలయక ఎవరినా చూపిస్తారేమో అని ఎదురు చూడటం అప్పుడు అది ఏంటో తెలయకపోయన ఇప్పుడు మాత్రం తలుచుకుంటే చాల బాగుంటుంది .......
                   స్నేహితుల మద్య చిలిపి తగాదాలు , మరలా  అవి ఎప్పుడు తిరతాయ తిరిగి వాళ్ళతో ఎప్పుడు మాట్లాడతామ? అని ఎదురు చుప్పులలో ని ఆ కమ్మదనం బాగుంటుంది
          ఆ  వయుసులో అమ్మ చేతి ఆవకాయ ముద్ద లోని కమ్మదనం , వనచినుకులో మట్టి వాసనలోని కమ్మదనం ఎన్ని సార్లు అనుబవించిన మళ్లీ  మళ్లీ  తనివి   తీరదు

                  చిన్నతనం లో తాతిముంజలు కోసం చుసిన ఎదురు ఛుపులు ! బియ్యములో దాచిపెట్టుకొని తిన్న ఈతకాయలు
                  బడికి వెళ్ళి దారిలో తాత దగ్గర కోనుకోన్ని తిన్న మరమారాల ఉండలు నాతో పాటు నా స్నెహుతులు కి కూడా ఇప్పించటం లో ని ఆ సరదా ఎంతో బాగుంటుంది
             
                    అప్పుడు అప్పుడు తాటి చెట్లకు ఉన్న కల్లు ను చూసినప్పుడు దాని రుచి ఎలా ఉంటుందో చూడాలి అన్న ఆలోచన మల్లి అంతలో బాగుండదేమో అన్న మొహమాటం
                 
                      శ్రీరామ నవమికి గుడి దగ్గర పానకం ఇస్తుంటే దానికోసం అది వరసలో 4 సార్లు నుంచునిఉండటం ఎంతో తియ్యని అనువభవం
                   
                           అందరికి సైకిల్ వచ్చింది మనకు మతర్మాయ్ రాలేదు అని స్వయం కృషి తో ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నం లో వెళ్లి మురుగు గుంటలో పడటం కపడండి అని అరిచినప్పుడు ఎలాగో బితకి రావటం తరవాత ఆ వాసనా పోవటానికి ఎన్నో సార్లు స్నానం చేయటం ఇప్పటికి మరపు రానిది
                                 రోజుకు ఒక గొడవ ఇంటిమేడైకి తెసుకొని వచినప్పుడు అమ్మ నాన్న లు చేసిన చేపిరి పూజలు ఎన్నో సార్లు...
                                   బస్సు డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్ళినప్పుడు అది కోపమో ఆపకుండా వెళ్ళాడు అనిన అసహనమో అది బస్సు మీద రాయ్యతో కొట్టటం ఆ డ్రైవర్ మమ్ములుని తరమటం అది చూసి మేము అందరం చాల దూరం పరిగేట్టం అది మరపురాని ది..................

                          తిరునాళ్ళలో ఆ బ్రేక్ డాన్సు లు చూస్తూ ఆనందించన ఆ క్షణాలు మళ్లీ తిరిగిరవేమో
             
                వేసవి సెలవలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడటం వచ్చాక ఉరు ఎప్పుడు వెళ్దామా అనుకోవటము అంత గడిచిపోయన రోజులు మళ్లీ రామన్న రావు కదా
                     అంత హ్యాపీ డేస్ వేణు దిరిగి చూసుకుంటే కానీ కొన్ని అపశ్రుతులు అవి ఎందుకు వస్తాయో అప్పుడు తెలయలేదు కానీ మంకు వయసు పెరిగిన కొద్ది అనుబవాలు మీద తెలుస్తాయి

                   అప్పుడు మన ప్రాణస్నెహుతులు మనకు దూరం ఇతి ఆ బాధ ఎలా ఉంటుందో మాత్రం మన మనసకు బాగా తెలుసు ఆ బాధ జీవితాంతం ఉంటుంది ఏమో
                ఇంకా చాల విషయాలు ఉన్నాయ్ బాల్యం లో జరిగినివి కానీ కొన్ని మాత్రమే ఇక్కడ చెప్పాను
బాల్యం గురించి కొన్ని చిరు మాటలు

                        జీవితం అనే పుస్తకం లో బాల్యం అనేది ఒక అందమైన అధ్యాయం 
                       ఆ అందమైన అధ్యాయంలో ఎన్నో తియ్యని ఐన పేజిలు 
                       ఒక్కో పేజి కి ఎన్నో మరపు రాని జ్ఞాపకాలు , ఒక్కో జ్ఞాపకం మన మదిలో చెరిగిపోని ,తిరిగిరాని తీపి గుర్తులు
                         ఆ తీపి గురతులు ఉంటాయి మనతో మన కడ వరకు
                        ఎన్నో అనుభవాలను మనకు పరిచయం  చేసే అనుభావజ్ఞాని ఈ మన బాల్యం 


 , అవి గుర్తు వచినప్పుడు మన మనసు అనుభవించే ఆనందం అంత ఇంత కాదు 

No comments:

Post a Comment