Pages

Sunday 9 August 2015

పుట్టుక :


పుట్టుక  అనెది ప్రతి జీవికి ఒక వరం ఏ జన్మ పుణ్యమో ఈ జన్మ మనకు లబించింది , అందున ఆడ జన్మ అంటే అదో వరం , కానీ ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టినదుకు సంతోషించాలో లేక బాధపడాలో తెలయని  అయోమయం

               ఒక అప్పుడు ఆడ పిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి అని ఆనంద పడే వాళ్ళు ! అదే ఈ రోజుల్లో ఆడపిల్లా? అనిపిస్తుంది
           
              కానీ ఆడ పిల్ల పుడుతుంది అంటే చాల వరకు అందరు బయపడే పరిస్థితి ఏర్పడింది
             అలంటి   ఆడ పిల్ల  ఆవేదన ఎలా ఉంటుంది ?????

                       అమ్మ నేను ఆడ పిల్లను కానీ ఆడుకొని బొమ్మను కాదు అమ్మ
                      నాకు కావలిసింది నీ గుండెలో గుప్పుడెంత చోటు మాత్రమే , చెత్త కుప్పల్లో కావలిసింత కాదు 
                      మణి మకుటాలు ఏమి వద్దు నాకు నీ ప్రేమ ఉంటే చాలు అమ్మ
                      ఎందుకు అమ్మ నేకు ఇంత వివక్షత నా మీద? కురిపించవా నా పై నీ ప్రేమ అని అమృతపు ధార
                     చల్లని నీ చూపు చాలు అమ్మ నాకు మమతలు ను విసిరే నీ చిరు నవ్వు చాలు అమ్మ నాకు
                    ఆప్యాయతలు ను పంచే నీ కమ్మని కౌగిలి చాలు , అంతస్తులును మురిపించే నీ అనురాగం చాలు అమ్మ !
                   ఆడ పిల్ల  ను నిజంగా ఆడ పిల్ల లనే చూస్తారు ఎన్ని తరాలు మరీనా ఈ వివక్షత అలానే  కొనసాగుతుంది  .

 అది నుండి ఆడ వాళ్ళ మీద అకృత్యాలు జరుగుతునే ఉన్నాయ్  నేను వంచించిన అడ వాళ్ళ గురించి మాట్లడటం లేదు ఎందుకు అంటే ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి , కొన్ని సార్లు మన ప్రమేయం లేకుండా మోసపోతున్న వాళ్ళ గురించి మాట్ల్దుతున్నాను

పుట్టిన నాటి నుండి సీత ల ఉండాలి , అనసూయ ల ఉండాలి అని చెప్తారు కానీ రావణుడు లాంటి వాళ్ళు ఉంటారు , కిచకులు ఉంటారు అని మాత్రం చెప్పటం లేదు మనకు

            కానీ  ఇప్పుడు ప్రతి చోట ఏదో ఒక రూపం లో కిచుకలు, దుస్యసనులు  తరాసపడుతున్నారు , ప్రతి రోజు మనం ఒక ద్రౌపది గురించి వింటున్నాము

                   యాత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర  దేవత ----ఎక్కడ స్త్రీ ని పూజిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని అంటారు కానీ ఈ రోజుల్లో ఎక్కడ స్త్రీ  వంటరి గ కనిపిస్తుందో అక్కడ మానవ మృగాలు సంచరిస్తునై
                   
మనకు అమ్మ కావాలి ఎందుకు అంటే మనం పుట్టాలి కాబట్టి సృష్టి అగకుడదు కాబట్టి , భార్య కావాలి ఎందుకు అంటే పెళ్లి చేసుకోవటానికి మనకు తోడూ గ , కానీ ఆడ పిల్ల మాత్రం వద్దు ఎందుకు అంటే భయం ఎక్కడ కాపాడాలి ,
ఎక్కడ ఒకరి కింద ఉండాలి అని
కానీ ఆడ పిల్ల అంటూ లేకపోతే ఇన్ని పాత్రలు ఎక్కడివి ?
                  మనకు  కార్యేషు దాసి
                              కర్మేషు మంత్రి
                              బోజేషు మాతా
                            సాయనేషు రంబ
అని అడ దాన్ని అన్నారు కానీ ఎప్పుడు ఎక్కడ మగ వారిని అనలేదు అది కూడా వాళ్ళ స్వలాభం కోసమే చెప్పి ఉండ వచ్చు బహుశా
                          ఇంకా ఐన ఈ వివక్షత పోవాలి అని మనసపుర్తి గ కోరుకుంటున్న 

No comments:

Post a Comment